కిమ్స్ కర్నూలులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ లో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ. రంజిత్ రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిమ్స్ హాస్పిటల్ హాజరై, జెండ ఎగరవేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది జాతీయగీతలాపాన చేశారు

ఈ సందర్భంగా శ్రీ. రంజిత్ రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిమ్స్ హాస్పిటల్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగం మరియు నిబద్ధతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మరియు వారు నిజమైన పోరాట వీరులన్నారు. సరసమైన వైద్య సంరక్షణను అందించే మన దేశాన్ని ఆరోగ్యకరమైన దేశంలో మార్చడంలో దేశం కోసం పోరాడటం మరియు వైద్య పరిశ్రమ అభివృద్ధి కోసం చేతులు కలపడం మన కర్తవ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్-కర్నూలు ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు