మహిళలందరికి పెద్దన్న మన జగనన్న : శ్రావణి
రాష్ట్ర మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు అని అన్నారు వైకాపా మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ బిల్లు తీసుకవచ్చారు అని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలు రాణించాలి అనేది జగనన్న లక్ష్యం అని తెలిపారు. అందుకోసం అన్ని విధాలా మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు తెలిపారు.