మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తా: డైరెక్టర్ రాజమౌళి
టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లి రాజమౌళి మరోసారి లేటెస్ట్ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన తన కుటుంబ సభ్యులకు కూడా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. రెండు వారాల క్వారంటైన్ పూర్తయిందన్న రాజమౌళి… ప్రస్తుతం లక్షణాలేమీ లేవన్నారు. కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్ వచ్చింది… ప్లాస్మా దానం చేయాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే.. డాక్టర్లు మూడు వారాలు ఆగాలని అన్నారని అన్నారు. ప్లాస్మా దానానికి శరీరంలో తగినన్ని యాంటీబాడీలు అభివృద్ధి చెందేందుకు సమయం పడుతుందని… యాంటీబాడీస్ అభివృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తామంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.