ఘట్కేసర్లో పెరుగుతున్న కరోనా కేసులు
నగర శివారు ప్రాంతమైన ఘట్కేసర్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న కట్టడి మాత్రం కావడం లేదు. దీంతో కరోనా ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వినాయక్ నగర్, ఎన్ఎఫ్సి నగర్, స్వర్ణగిరి కాలనీ, బ్రేక్ బ్యాండ్ కాలనీ, మేదా కాలనీ, సింగపూర్ టౌన్ షిప్లలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావలంటే ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం తప్పా ఎవరూ కూడా బయట తిరగవద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.