ఎస్సార్‌నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు
ఎస్సార్‌నగర్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణపై సినీనటి శ్రీసుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రముఖ సినీమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొన్నాళ్ల క్రితం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో నటి శ్రీ సుధ ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సీఐ మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శ్యామ్ కె. నాయుడును అరెస్టు చేయకపోవడమే కాకుండా.. కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్ సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా సీఐతో మాట్లాడిన సాక్ష్యాలను కూడా ఆమె ఏసీబీ అధికారులకు అందజేశారు.