సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కారణంగా ఇన్నాళ్లు మూసి ఉంచిన స్కూళ్లను పునఃప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 31వ తేదీ నాటికి స్కూళ్లలో నాడు-నేడు పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు జగన్. అంతేకాదు నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు. అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు సీఎం జగన్.