సారీ నో హెల్త్ బులెటిన్ టుడే
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. కొత్త విధానంలో ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో శుక్రవారం నాటికి 52,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 బారిన పడి ఇప్పటివరకు 455 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 15,445 పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 3,37,771 శాంపిల్స్ పరీక్షించారు. ప్రతి పది లక్షల జనాభాకు సగటున 8,444 పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 40,334 మంది డిశ్చార్జ్ కాగా, 11,677 మంది చికిత్స తీసుకుంటున్నారు.