7/G బృందావ‌న కాల‌నీ హీరోయిని రెండో పెళ్లికి రెడీ !

క‌రోనా విళ‌యతాండ‌వం చేస్తున్నా వివాహాది శుభ‌కార్యాలు మాత్రం ఎక్క‌డా ఆగ‌డం లేదు. క‌రోనా భ‌యం జ‌నాల‌ల్లో వున్నా ఫంక్ష‌న్‌ల విష‌యంలో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఫంక్ష‌న్‌లు, పెళ్లిళ్లు జ‌రుగుతూనే వున్నాయి. టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. దిల్ రాజు, నిఖిల్ వ‌రుస‌గా వివాహాలు చేసుకోగా ఆగ‌స్టులో నితిన్‌, రానా వివాహాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా వుంటే కోలీవుడ్‌లోనూ పెళ్లిళ్ల హంగామా మొద‌లైంది. ఇటీవ‌ల న‌టి వ‌నిత మూడ‌వ వివాహం చేసుకుని వార్త‌ల్లో కెక్కిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో న‌టి పెళ్లికి రెడీ అవుతోంది. అది కూడా రెండ‌వ పెళ్లి. 7 / జి బృందా‌వ‌న కాల‌నీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సోనియా అగ‌ర్వాల్ ఆ త‌రువాత 2006లో ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో 2010లో విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఒంట‌రిగానే వుంటున్న సోనియా అగ‌ర్వాల్ త్వ‌ర‌లో రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.
సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్త నిజ‌మ‌నే సంకేతాలిస్తోంది. ఎంగేజ్‌మెంట్ త‌న‌కు మ‌రో రెండు రోజుల్లో జ‌ర‌గ‌బోతోంద‌ని చెబుతూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ల‌కు సంబంధించిన ఓ ఫొటోని ఈ నెల 23న సోనియా అగ‌ర్వాల్ షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సోనియా అగ‌ర్వాల్ ఎంగేజ్‌మెంట్ ఎవ‌రితో.. అందులో వున్న నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే శ‌నివారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.