రామ మందిర నిర్మాణానికి యాద‌గిరి గుట్ట మ‌ట్టి

ఆగస్ట్ 5న అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో జరిగే భూమి పూజకు యాదాద్రి నుంచి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం మట్టిని పంపించారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ నాయకులు మాట్లాడుతూ రామజన్మభూమి కార్యక్రమానికి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నదీ జలాలను వినియోగించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రి క్షేత్ర మట్టిని నూతన గోశాలలోని స్వామివారి పవిత్రమైన తులసి వనం నుంచి సేకరించినట్లు చెప్పారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక కలశ పూజలు నిర్వహించి హైదరాబాద్ లోని వీహెచ్పీ ఆఫీస్ కు పంపించినట్లు చెప్పారు.