మద్యం దొరక్క శానిటైజర్ తాగి యువకుడు మృతి
నెల్లూరు జిల్లాలోని ఎఎస్ పేటలో శానిటైజర్ తాగి ఓ యువకుడు మృతిచెందారు. గ్రామంలో కంటైన్మెంట్ జోన్ అమలులో ఉండటంతో మద్యం విక్రయాలు నిలిపివేశారు. దీంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.