మ‌న జాగ్ర‌త్తే మ‌న‌కు ర‌క్ష‌ణ : ప‌్ర‌వీణ్‌కుమార్‌

క‌రోన మ‌హామ్మారి స‌మ‌యంలో మ‌నం తీసుకునే జాగ్ర‌త్త‌లో మ‌నల్ని ర‌క్షిస్తాయ‌ని మెద‌క్ జిల్లా ‌యువ‌జ‌న సంఘాల నాయ‌కుడు, ధ‌రిప‌ల్లి గ్రామా యువకుడు ప్ర‌వీణ్‌కుమార్ అన్నారు. మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంపై గ్రామంలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. వివిధ ప‌నుల నిమిత్తం మండ‌ల కేంద్ర‌మైన శంక‌రంపేట‌, స‌మీప ప‌ట్ట‌ణాలు మెద‌క్‌, తూప్రాన్‌, చేగుంట‌, వెల్థుర్తి , హైద‌రాబాద్ వెళ్లే వారు త‌ప్ప‌నిస‌రి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. వ్య‌వ‌సాయ‌, త‌దిత‌ర ప‌నులు ముగిసిన త‌రువాత ప్ర‌జ‌లు సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంటికే ప‌రిమితం కావాల‌న్నారు. యువ‌త కూడా అన‌వ‌స‌ర‌మైన త‌ప్పుడు ప్ర‌చారాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయ‌వ‌ద్ద‌ని కోరారు.