మెదక్ జిల్లాకు వణికిస్తున్న కరోన
రోజు రోజు మెదక్ జిల్లాలో కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజలు వణికిపోతున్నారు. ఓ వైపు యుక్త వయసులో కరోన సోకిన ప్రాణాలు పోతున్న సంఘటనలు ప్రజలని బయపెడుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల వల్ల వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున్న నష్టాల బాటలో వెళ్లాయి. ఇవాళ ఏకంగా జిల్లాలో 26 కేసులు నమోదు కావడం విస్మయానికి గురి చేస్తుంది. వ్యవసాయ పనుల నిమిత్తం మెదక్ , తూప్రాన్, చేగుంట పట్టణాలకు వెళ్ళాలి అంటే ప్రజలు వణుకుతున్నారు. ఇందుకు అక్కడ పాజిటివ్ కేసులు నిత్యం పెరుగుతుందడమే కారణంగా కనిపిస్తోంది.