ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడిని ఖండించిన భాజపా నేత సంతోష్‌రెడ్డి
నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడిని మెదక్ జిల్లా భాజపా నాయకులు ధరిపల్లి సంతోష్‌రెడ్డి ఖండించారు. తమ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆకారణంగా తమ పార్టీ ఎంపీపై ఎందుకు దాడి చేశారని ఆయన ప్రశ్నించారు. నిందితులకు శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతాయని హెచ్చరించారు. అర్వింద్ వచ్చిన తర్వాత నిజామాబాద్‌లో భాజపాకి ఆదరణ పెరిగిందని అన్నారు.