కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేక తండ్రి ఆత్మహత్య
కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేదన్న ఆవేదనతో సురేంద్ర నాయక్ (45) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో జరిగింది.
ఐదుగురు కూతుళ్లు ఉన్న ఆ తండ్రి అప్పు చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు. మిగిలిన ముగ్గురి విషయంలో ఆవేదనతోనే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.