భయంగుప్పిట్లో అమితాబ్ కుటుంబం
సామాన్యులనే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలను కూడా కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజాగా కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. ‘నాక కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆస్పత్రికి తరలించారు. మా కుటుంబసభ్యులు, సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. మరోవైపు ఆయనకు కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమితాబ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక అమితాబ్ తనయుడు, ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ సైతం కరోనా బారిన పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.