ఘట్కేసర్లో అడుగుపెట్టాలంటే భపడుతున్న ప్రజలు
కరోనా వైరస్ వల్ల ఘట్కేసర్లో నిత్యం కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తుండంతో ప్రజలు బయటకి రావాలి అంటే భయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఒకరి నుంచి మరొకరి ఈ వ్యాధి సోకడంతో వ్యాపారాలు చేసే ప్రజలు కూడా జంకుతున్నారు. ఎక్కడి నుంచి తమకి వ్యాపిస్తోందో అని స్వచ్చంధంగా లౌక్డౌన్ పాటిస్తున్నారు. ఇప్పటికే లౌక్డౌన్ వల్ల విపరీతమైన నష్టాలను చవిచూశామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వివిధ పనుల నిమిత్తం ఘట్కేసర్ కి వచ్చే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని ప్రజలకు అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.