త‌ల‌సానికి కౌంట‌ర్ వేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిపడ్డారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలో వైర‌ల్ అవుతున్న సీఎం న్యూస్‌పై మంత్రి స్సందించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో పాల‌న సాగుతున్నా… ముఖ్య‌మంత్రి ఎక్క‌డ ఉన్నారో తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటున్నార‌ని పేర్కొన్నారు. పాల‌న సాగుతోంది క‌దా సీఎంతో ప‌ని ఏంటి అంటే,……సీఎం ప‌ద‌విలో ఆయ‌న ఎందుక‌ని ప్ర‌శ్నించారు. సీఎం ఎక్క‌డున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని డిమాండ్ చేశారు రాజ‌శేర్‌రెడ్డి.