రాజశేఖర్ రెడ్డి లేఖకు స్పందన ?
మెదక్ జిల్లా ధరిపల్లి గ్రామాన్ని ఇటీవల ఏర్పడిన నూతన మండల మాసాయిపేటలో విలీనం చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి లేఖకు సీఎంఓ స్పందించింది అనే వార్త చక్కర్లు కొడుతోంది. పరిపాలన సౌలభ్యం కోసం ధరపల్లి గ్రామాన్ని విలీనం చేయడంల వల్ల అనేక విధాలుగా లాభం ఉంటోందని తన లేఖలో రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా నూతన మండలంలో 9 గ్రామాలు ఎక్కవ మొత్తంలో విస్తీర్ణంగా చూసుకుంటే అవి చిన్న గ్రామాలుగానే ఉన్నాయని తెలిపారు. ధరిపల్లిని విలీనం చేయడం వల్ల మండలం విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. అయితే రాజశేఖర్‌రెడ్డి లేఖకు స్పందన వస్తున్నట్లు ఇటు వెల్ధుర్తి, శంకరంపేటలో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా దృవీకరణ కాలేదు ఇంకా.