తూప్రాన్‌లో పెరుగుతున్న క‌రోనా మర‌ణాలు

ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల‌తో అల్లాడుతున్న తూప్రాన్‌లో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గ‌తంలో క‌రోనా వ్యాపారి చ‌నిపోగా మ‌ళ్లీ ఇవాళ కిర‌ణా వ్యాపారి మృతి చెంద‌డంతో ప‌ట్ట‌ణంలో భ‌యం గుప్ప‌ట్లో బ‌తుకుతోంది. గ‌త కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెర‌గ‌డం ప్ర‌జ‌ల్ని ఆందోళ‌న క‌లిగిస్తుంటే తాజా మ‌ర‌ణాలు మ‌రింత భ‌యాన్ని పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కిరాణా షాపుల‌కు వెళ్లాలి అంటే తూప్రాన్‌లో ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇంట్లో నుండి బ‌య‌ట‌కి రావాడానికి కూడా జంకుతున్నారు. తాజా మ‌ర‌ణంతో మ‌ర‌ణాల సంఖ్య రెండుకు చేరుకుంది. కాగా ప‌ట్ట‌ణ చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు కూడా రావాడానికి జంకుతున్నారు అంట‌గే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌ర ప‌నులు ఉంటే త‌ప్పా… ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట తిర‌గ‌వ‌ద్ద‌ని అధికారులు, పోలీసులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు.