ధరిపల్లిలో భాజపా ఇంటింటి ప్రచారం
దేశం కోసం సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉండాలని మెదక్ జిల్లా ధరిపల్లి భాజపా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. రెండు రోజులుగా జిల్లా బిజెపి నాయకులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ధరిపల్లిలో దేశం కోసం ప్రధాని చేసిన సేవలు, ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాల గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లౌక్‌డౌన్ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అందుకోసం ప్రధానిక అతిపెద్ద ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. అలాగే గ్రామ భాజపా నాయకులు సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ చైనా, పాకిస్థాన్ దేశాలకు మోడీ, అమిత్‌షా తమైదన రీతిలో సమాధానం చెబుతున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం రాని కశ్మీర్ సమస్యను పరిష్కారం చూపిన గొప్ప నాయకుడు అని తెలిపారు. ధరిపల్లి గ్రామంలో యువత ఎక్కవుగా భాజపా వైపు మొగ్గు చూపడం హర్షనీయమని అన్నారు. మరింత ఉత్సహంతో ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సంతోష్‌రెడ్డి. అనంతరం అవుడం మహేష్ మాట్లాడుతూ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చిన మహానీయుడు మోడీజీ అని పేర్కొన్నారు. హిందుయిజం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.