స్పీడ్ రైలు ముచ్చ‌ట్లు అందుకే : తెజ‌స

మ‌ళ్లీ ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికే మంత్రి కేటీఆర్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని విమ‌ర్శించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ‌త్వ‌ర‌లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకోవ‌డానికే క‌ళ్ల‌బొల్లి మాటాలు చెప్పి మాయ చేయాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. అస‌లు ఆంధ్రాతో స‌బంధాలు వ‌ద్దు అనుకొని విడిపోయిన రాష్ట్రానికి స్పీడ్ రైలు రావాల‌ని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఆయ‌న‌. విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య హై స్పీడ్ ట్రైన్ రావడానికి అస‌లు కార‌ణ హైద‌రాబాద్‌లో ఉన్న ఆంధ్రాప్రాంత ఓటర్ల‌ను మ‌భ్య‌పెట్టాడానికే అని అన్నారు. ఉన్నపలంగా పక్క రాష్ట్రము మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పాల‌న్నారు. పక్క రాష్ట్రము అంటే పగ పట్టి
చూసే తెలంగాణ మంత్రులు అందులోను తెలంగాణ సీఎం కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ఆంధ్రా వాళ్ళ మీద ఇటీవల కాలంలో ప్రేమతో మాట్లాడుతున్నారు అని ప్ర‌శ్నించారు.