రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని.. ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.