టీఆర్ఎస్ పార్టీని వదలని కరోనా
కరోనా వైరస్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని వదలడం లేదని చెప్పుకోవాలి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకి ఆసుపత్రి పాలుకాగా…. తాజాగా మంత్రివర్గంలోకి వైరస్ అడుగు పెట్టింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహామూద్ అలీకి గత కొన్ని రోజులు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయగా ఇవాళ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ని ఆపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాగా ఇప్పటికే అతని వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోరనా సోకింది. అయితే ఇప్పుడు మంత్రితో ఎవరేవరు సన్నిహితంగా ఉన్నారో అనే లెక్క తేల్చడంలో అధికారులు బిజీ బిజీగా అయ్యారు. లౌక్‌డౌన్ అంశం మీద చర్చించడానికి త్వరలో మంత్రివర్గ సమావేశం ఉడడంతో ఇప్పుడు మిగిత మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ హోంశాఖ మంత్రి సమావేశానికి హాజరవుతే చాలా మంది సోకే అవకాశం ఉన్నది. కాబట్టి సమావేశాలకు వెళ్లే మంత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుండి ఆదేశాలు జారీ చేశారు.