ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి : శాంతి కుమార్
సోషల్ మీడియాలో పద్మశాలి కులస్తులను కించపరుస్తూ పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పోపా ప్రధాన కార్యదర్శి వనం శాంతి కుమార్ అన్నారు. రోజులు గడుస్తున్న అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. శనివారం పోపా జిల్లా ప్రధాన కార్యదర్శి వనం శాంతి కుమార్, పోపా జిల్లా నాయకులైన పెండెం నాగార్జున GHM, ZPHS జలాల్ పూర్ , శ్రీ బోడ విద్యా సాగర్ GHM ZPHS BN తిమ్మాపూర్ భువనగిరి గారలు కలిసి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ IPS, గారిని కలిసి పిరాధ్యు చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయి నిరాశలకు గురై ఆకలి చావులకు గురి అవుతున్న పద్మశాలి కులస్తులను ఆలేరులో అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడమని కమిషనర్‌కి వివరించారు. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసికోవాలని కోరారు. స్పందించి తగు చర్యల నిమిత్తమై తక్షణమే లేఖపై ఎండార్స్ చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదాద్రి భువనగిరి గారికి పంపించారు. ఈ సందర్బంగా పద్మశాలి కులస్తుల కోసం జరిపే అన్ని పోరాటంలో పద్మశాలి సంఘంనకు పోపా యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ మద్దత్తు ప్రకటిస్తుంది శాంతికుమార్ తెలిపారు.