మెదక్‌లో పైసల్ పెట్టనిదే ఫైల్ కదలదు ఎక్కడో తెలుసా మీకు ?
ప్రభుత్వాలు మారినా…. లంచగొండితనం మారడం లేదని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో మాత్రం అవినీతి పగడ విప్పి నాట్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రవాణా శాఖలో సామాన్య ప్రజల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. పైసలు పెట్టనిదే ఫైల్ కదలని పరిస్థితి ఉందని విమర్శించారు. తాజాగా మెదక్ ఆర్టీవో ఆఫీస్ లో ఈ పరిస్థితి తను ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు మెదక్ ఆర్టీవో ఆఫీస్ వద్ద బ్రోకర్లు రాజ్యం సాగుతోందని అక్కడి బ్రోకర్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సామాన్యుల వద్ద వసూలు చేస్తూ బ్రోకర్ పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. మెదక్ ఆర్టీవో ఆఫీస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని మెదక్ లో ఉన్న ఏ అధికారిక కార్యాలయమైన ఇలాగే ఉందని ఇది ఇక్కడి నాయకులు లోపం కూడా అని ఆయన విమర్శించారు.