చేగుంటలో మరో కరోనా కేసు
మెదక్ జిల్లాను కరోనా వదలడం లేదు. ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. మరోవైపు అదుపు లేకుండా కరోనా కేసలు నమోదు అవుతునే ఉన్నాయి. ఇటీవల చేగుంటలో వరుస కేసులు నమోదే కావడం ఆ పట్టణ ప్రజలన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది. ఇంట్లో నుండి కాలు భయట పెట్టాలంటే… ప్రజలు గజగజ వణుకుతున్నారు. కాగా ఇవాళ అక్కడ మరో కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోన సోకిన మహిళ ఇటీవల ముంబాయి నుండి వచ్చిందని సమాచారం. అలాగే జిల్లాలో అల్లాదుర్గంలో ఓ బాలికకు బయటపడింది. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లివచ్చినట్లు సమాచారం. ఏదీ ఏమైన జిల్లాలో కరోన కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.