యువ‌త వ‌ల్లే హరిత విప్ల‌వం సాధ్యం : తిరుప‌తి యాద‌వ్‌

రాష్ట్ర మంత్రి కేటీఆర్ క‌ల‌లు గ‌న్న హరితవిప్ల‌వం కేవ‌లం యువ‌త వ‌ల్లే సాధ్య‌మవుతుదంని తెరాజ యువ‌జ‌న నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఆరో విడుత హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13 డివిజన్
పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. కేసీఆర్‌, కేటీఆర్ ఆదేశాల మేర‌కు తెలంగాణ య‌వ‌త ఉద్య‌మంలా మొక్క‌ల పెంప‌కం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాబోయే త‌రాల‌కు కావాల్సిన వ‌న‌రులు మ‌న సృష్టించ‌డం ద్వారానే… వారు ల‌బ్ధి పొందుతార‌ని అన్నారు. విచ్చ‌ల‌విడి సంస్కృతిలో భాగంగా న‌గ‌రంలో చెట్లు లేకుండా చేస్తున్నార‌ని, భ‌విష్య‌త్తులో క‌నీసం ఆక్సిజ‌న్ పీల్చుకోలేని స్థితికి వెళ్తామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఒక్కొక్క మొక్క నాటి వాటిని కాపాడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు.