ధరిపల్లిలో ప్రారంభమైన హరితహారం

రాష్ట్రంలో హరితవిప్లవం రావాలి అని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండ‌లం ధరిపల్లి గ్రామంలో హరితహారం చేపట్టారు ప్రజాప్రతినిధులు. గ్రామ సర్పంచ్ నాగులపల్లి సిద్దిరాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరిత విప్లవం కోసం ప్రతి ఒక్కరం పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ మహేష్, ఎంపీటీసీ రాణెమ్మ, వార్డు సభ్యులు ప్రవీణ్ కుమార్, గ్రామా కార్యదర్శి సాయిబాబు, గ్రామా యువకులు రవి, కాంగ్రెస్ నాయకులు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.