తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం

తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. అసెంబ్లీలో మార్ష‌ల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న జనార్ధ‌న్ రెడ్డి అనే వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. జ‌నార్ధ‌న్ రెడ్డి ఈ నెల 22(సోమ‌వారం) రాత్రి వ‌ర‌కూ డ్యూటీ లోనే ఉన్నారు. దీంతో అసెంబ్లీ సిబ్బందిలో తీవ్ర ఆందోళ‌న నెలకొంది. ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఆ మార్షల్ తో కాంటాక్ట్ లో ఉన్న ఇతర మార్షల్స్ , అటెండర్లు, చౌకి దార్ల సమాచారాన్ని అసెంబ్లీ సెక్రటరి న‌ర‌సింహ చార్యులు సేకరించారు. అయితే వీళ్ళందరికీ పరీక్షలు చేయించాలా.. హోమ్ క్వారంటెన్ కు పంపాలా అనే విషయం పై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.