కామారెడ్డిలో 10 కరోన కేసులు
రోజు రోజుకు కామారెడ్డి జిల్లా హాట్‌టాపిక్ మారుతోంది. నిత్యం కరోన కేసులు పెరగడంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. ఇవాళ ఒక్క రోజే 10 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారులు, ప్రజలు ఆందోళనలో ఉన్నారు. నిన్న ఒక కేసు నమోదు కాగా ఇవాళ పది కేసులు నమోదు కావడంతో అధికారలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు హోం క్వారంటైన్‌కి తరలించారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారు ఇటీవల కాలంలో ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అనే కోణంలో అధికారులు కూపీ లాగుతున్నారు. అత్యవసరం ఉంటే తప్పా… ఎవరు బయటకు రావొద్దు అని డాక్టర్లు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.