కామారెడ్డిలో విజృంభిస్తున్న కరోనా
కామారెడ్డి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే కరోనా కేసులతో అల్లాడిపోతున్న కామారెడ్డికి పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఇవాళ కొత్తగా మరో మూడు కేసులు నమోదు కావడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల కామారెడ్డిలో స్వచ్ఛంధంగా లౌక్డౌన్ పాటించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. కామారెడ్డి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇక్కడి రాకపోకలు సాగిస్తుంటారు దీంతో పట్టణ ప్రజలు, రైతులు ఆందోళన పడుతున్నారు. కామారెడ్డి పట్టణానికి ఎవరు వచ్చిన తప్పకుండా మాస్క్, శానిటైజర్ వాడాలని పోలీసులు సూచిస్తున్నారు.