కరోనా సంక్షోభంలో ఎయిర్‌టెల్ తన పంపిణీదారులు మరియు భాగస్వాములకు సహాయం

• 30 వేలమంది డీలర్లు మరియు డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల ఉద్యోగులకు మే నెల జీతాలను చెల్లించనున్న ఎయిర్టెల్

టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములచే నియమించబడిన దాదాపు 30,000 మంది సిబ్బందికి మే జీతాలు చెల్లించాలని నిర్ణయించింది, ఈ నెలలో కరోనా కారణంగా ఏర్పడిన కష్టాలకి సహాయంగా ఎయిర్టెల్ తమ భాగస్వాముల ఉద్యోగులను ఆదుకోవాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్ నెలలో కూడా సంస్థ ఇదే విదంగా సహాయం చేసింది.
మే 2020 వరకు ఎయిర్‌టెల్ 30,000 మంది భాగస్వాముల ఉద్యోగుల బేసిక్ జీతాలను చెల్లిస్తుంది, ఇది మే చివరి వరకు పొడిగించిన లాక్‌డౌన్ ప్రభావంపై ఉద్యోగులు మరియు ఛానల్ భాగస్వాముల కుటుంబాలకు సహాయపడటానికి ఉద్దేశించిన చర్య.

కరోనా కారణంగా దేశంలో వ్యాపార సంస్థలన్నీ దెబ్బతిన్నాయి. దీనికి టెలికం కంపెనీలు కూడా మినహాయింపు కాదు. అయితే సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ తమ భాగస్వాములను, పంపిణీ దారులను, రిటైల్ ఫ్రాంచైజీదారులను ఆదుకునేందుకు ఎయిర్‌టెల్ చేయూతనందించనున్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పూరి తెలిపారు.