భారత్కు రానున్న సానియా మీర్జా భర్త షోయబ్
కరోనా వల్ల భార్య భర్తలు దూరమైన సంఘటనలు మనం చాలనే చూశాం. ఇప్పడు ఆ కోవలేనే భారత టెన్నిస్ స్టార్ సానియా కూడా ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్ మాలిక్ విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన్నించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు హైదరాబాద్లో చిక్కుకుపోయిన భార్య, పిల్లలతో గడిపేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. మానవతా కోణంలోనే ఈ వెసులుబాటు కల్పించినట్టు పీసీబీ చైర్మన్ వసీం ఖాన్ పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితం భారత్కు వచ్చిన సానియా మీర్జా లాక్డౌన్ విధించడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడూ బిజీబిజీగా గడిపే తాము లాక్డౌన్ వేళలో కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.