ఇండియాలో 8 రోజులలో ల‌క్ష కేసులు

క‌రోనా పాజిటివ్ కేసుల్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలను దాటగా.. కేవలం ఎనిమిది రోజుల్లోనే మూడు నుంచి నాలుగు లక్షలకు చేరడం గమనార్హం. గ‌డిచిన 24 గంట‌ల‌లో అత్యధికంగా 15వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 377 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.11లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 13,183కి చేరింది.