మంత్రి ఈటెల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి : ర‌ఘునంద‌న్‌రావు

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ నోరు ఆదుపులో పెట్టుకొని మాట్లాడాల‌ని మెద‌క్ జిల్లా భాజ‌పా నేత ర‌ఘునంద‌న్‌రావు అన్నారు. క‌రోనా విష‌యంలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో జ‌ర‌గుతున్న విష‌యాల గురించి ప‌ట్టించుకోకుండా వేరే రాష్ట్రాల గురించి, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు గురించి మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. హై కోర్టు మొట్టికాయ‌లు వేస్తే కానీ రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డానికి ముందుకు రాలేద‌ని అన్నారు. చిత్త‌శుద్ధి ఉంటే పొరుగు రాష్ట్రాల్లో చేసిన మాదిరిగానే ఇక్క‌డ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించారు. అంతేకానీ రాజ‌కీయాలు చేయ‌డానికి ఇది త‌గిన స‌మ‌యం కాద‌ని అన్నారు.