భాజపా రాష్ట్ర కార్యాల‌యంలో యోగా దినోత్స‌వం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆధ్వ‌రంలో యోగా దినోత్సవం జ‌రిగింది. ప్ర‌ధాని మోడీ భార‌తీయ యోగా గురించి ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. గ‌తంలో యోగా చేసే వారని కానీ దానికి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం మోడీగారే అని అన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 22న యోగా దినోత్స‌వం నిర్వ‌హించ‌డం గొప్ప సంస్కృతికి తెర‌తీసింద‌న్నారు. పార్టీ కార్యాల‌యంలో సామాజిక దూరం పాటిస్తూ… యోగా చేశారు.