ఇది నీకు న్యాయ‌మా సీఎం కేసీఆర్ : తెజ‌స

తెలంగాణ అంటే పడి చచ్చే సీఎం కేసీఆర్ సార్ ఇది నీకు త‌గునా.. ర‌వ్వంత న్యాయంగా ఉందా మీకు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డ ముఖం కూడా చూడ‌డానికి నీకు ఇష్ట‌త్ అనిపియ‌లేదు అంటే ఎలా సార్. ప‌క్క రాష్ట్రం ఒల్లు మ‌న శ‌త్రువులుగా త‌యారు చేసి వారిపై యుద్ధం చేసిన‌ట్టు చేసి రాష్ట్ర తెచ్చుకున్నాము. ఆనాడు శ‌త్రువులుగా క‌నిపించిన వారు స్వ‌రాష్ట్రం వ‌చ్చినాకా సినిమా పెద్ద‌లు, రియల్ ఎస్టేస్ వ్యాపారులు ఇలా మీకు మిత్రుల‌య్యారు. సినిమా ప్ర‌ముఖులు చ‌నిపోతే.. వారి ఇంటికెల్లి మ‌రీ నివాళ్లు ఆర్పించారు. వారికి జాగ‌లేద‌న్న‌ట్లు స‌మాధి క‌ట్ట‌డానికి జాగ ఇచ్చావు. కానీ దేశం కోసం మ‌న స‌రిహ‌ద్దులో ఉద్య‌మాల పురటిగ‌డ్డ సూర్య‌పేట జిల్లా క‌నుముస్తే క‌నీసం పూల‌దండ వేసి నివాళ్లు ఆర్పించేంత టైం లేద‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఉన్న సోయి కూడా ఆయ‌న‌కి లేకుండా పోయింద‌ని ఆరోపించారు. ఆంధ్రావాళ్లు చ‌నిపోతే వాళ్ల ఇంటికి వెళ్లిన సీఎం దేశం మొత్తం క‌న్నీరు పెట్టిన క‌ల్న‌ల్ సంతోష్ మృత‌దేహాన్ని చూడటానికి ఎందుకు ఇష్టం లేక‌పోయిందో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం ఖ‌చ్చితంగా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇదే ఘ‌ట‌న‌లో చ‌తీస్‌ఘడ్ రాష్ట్రంలో మ‌ర‌ణించిన సైనికుల అంత్య‌క్రియ‌ల్లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పాల్గొని పాడే మోసార‌ని గుర్తు చేశారు.