ప్రజల మనసులో సంజీవ రెడ్డి : గద్ద తిరుపతి
ఘట్కేసర్ మండల మాజీ జెడ్.పి.టి.సి, తెరాస రాష్ట్ర నాయకులు మంద సంజీవరెడ్డి, సునీతల వివాహ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా వారికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ యూత్ జనరల్ సెక్రెటరీ గద్ద తిరుపతి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తల కోసం ఎల్లప్పుడూ సంజీవరెడ్డి అందుబాటులో ఉంటారని… అందరికి సహాయం చేసే దయగల మనసు అని తెరాస పార్టీ యూత్ జనరల్ సెక్రెటరీ గద్ద తిరుపతి యాదవ్ అన్నారు. ప్రజల మనసులో ఆయనకి సుస్థిర స్థానం ఉందని పేర్కొన్నారు.