చైనా దాడిని ఖండించిన యువనేత రాజశేఖర్‌రెడ్డి
భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల మెదక్ జిల్లా తెలంగాణ జనసమితి యువజన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని ఆయన అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భారత సరిహద్దులో చైన కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. చైనా బలగాలు చేసిన దాడులకు ప్రతీకార దాడులకు భారత సైనిక బలగాలు త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.