మెద‌క్‌లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

మెద‌క్ జిల్లాను క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఒక్క‌రోజే 13 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌ర పెడుతోంది. జిల్లాలో ముఖ్యంగా తూప్రాన్ ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున క‌రోన కేసులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో నుండి ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఓవైపు వ్య‌వ‌సాయ ప‌నులు మొద‌లు కావ‌డంతో రైతులు ఎక్కువ‌గా తూప్రాన్‌లో ఎర‌వువులు, విత్త‌నాల కోసం పెద్ద ఎత్తున్న రాక‌పోక‌లు సాగిస్తుంటారు దీంతో స‌మీప ప‌ల్లెవాసులు చాలా భ‌య‌ప‌డుతున్నారు. ఇవాళ ఏకంగా 8 పాజిటివ్ కేసులు రావ‌డంతో అధికారులు, ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. లౌక్‌డౌన్ స‌డిలించికా… కేసులు పెర‌గ‌డం, ఒక‌రి నుండి మ‌రొక‌రికి సోక‌డం అనేక ఇబ్బందులు తీసుక‌వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.