My Talking Tom Friends ఇప్పుడు డౌన్ లోడ్ చేసుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా లభ్యం
విప్లవాత్మక నూతన వర్చువల్ పెట్ (virtual pet) గేమ్ ను ఆడి ఆనందించండి

Outfit7 నేడిక్కడ తన నూతన వర్చువల్ పెట్ గేమ్ My Talking Tom Friends (ఇప్పుడు ఇది డౌన్ లోడ్ కు సిద్ధంగా ఉంది) ప్రపంచవ్యాప్తంగా ఐఒఎస్ (iOS), ఆండ్రాయిడ్ (Android) లపై డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రకటించింది. అవార్డ్ విన్నింగ్ Talking Tom and Friends ఫ్రాంఛైజ్ నుంచి అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కొత్త గేమ్ అందిస్తుంది గతంలో ఎన్నడూ చూడని రకాన్ని అందిస్తుంది. అన్ని ఆరు ఐకానిక్ క్యారెక్టర్స్ ను ప్లే యాజ్ యు వాంట్ (మీరు కోరుకున్న విధంగా ఆడండి) శాండ్ బాక్స్ అనుభూతిలోకి ఏకం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దీన్ని ఆడకుండా ఉండలేకపోతున్నారు. ఆవిష్కరణకు ముందే ఇది ఒక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచే దాదాపు 1.3 కోట్ల ప్రిరిజిస్ట్రేషన్స్ ను పొందింది – కంపెనీకి ఇది ఒక రికార్డు బ్రేకింగ్ విజయం.

ఈ సందర్భంగా Outfit7 సీఈఓ జిన్ యు కియాన్ మాట్లాడుతూ, ‘‘My Talking Tom Friends తో మా ఆశ యం….ఈ వర్చువల్ పెట్ రకాన్ని మరింతగా ప్రజాదరణ పొందేలా చేయడం మరియు దాన్ని పునరావిష్కరించ డం. ప్రజలు కోరుకునే దాన్ని అందించడం’’ అని అన్నారు.

‘‘మొట్టమొదటిసారిగా మేము మా అభిమానులు ఒక్కరితో కాదు….ఒకటే సమయంలో పలు క్యారెక్టర్లతో ఆడు కునే అవకాశాన్ని అందిస్తున్నాం. అదీ తాము ఎంచుకున్న విధంగా. ఇది ప్రాక్టికల్ గా అపరిమిత అవకాశా లను అందిస్తుంది. ప్రతీ ఒక్క యూజర్ కు కూడా ఒక విశిష్ట ప్లేయింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ గేమ్ ను అభిమానులు ఎలా ఆదరిస్తారోనని మేము ఉద్వేగంగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

ఈ ఫ్రాంచైజీకి నూతన జోడింపు అయిన టాకింగ్ బెక్కా – టాకింగ్ టామ్, టాకింగ్ ఆంజెలా, టాకింగ్ హాంక్,
టాకింగ్ బెన్, టాకింగ్ జింజర్ లతో చేరింది. ఆటగాళ్లు ఇప్పుడు ఈ ఆరుగురికి అభినందనలు చెప్పవచ్చు, వారు తమ ఆకాంక్షపూరిత జీవితాలను గడపడంలో తోడ్పడవచ్చు.

ఈ స్నేహితులంతా కూడా డైనమిక్ గా ఉంటారు. అంతా కలియతిరుగుతుంటారు. వినోదం కోసం పరితపిస్తుం టారు. వంట చేయడం, పెయింటింగ్, గార్డెనింగ్, సోషలైజింగ్ వంటి వాటిల్లో ఆటగాళ్లు వాటితో కలసి పాల్గొనవ చ్చు. సరికొత్త, యాక్షన్ ప్యాక్డ్ మినీ – గేమ్స్ సూట్ కూడా ఉంటుంది. ఇంప్రెసివ్ ఇంటరాక్టివ్ ఆప్షన్లు అభిమాను లు అందంగా డిజైన్ చేయబడిన వర్చువల్ ప్రపంచాన్నితమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకు నేందుకు వీలు కల్పిస్తాయి.