సుశాంత్‌సింగ్ మరణంపై స్పందించిన ఐశ్వర్య
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కన్నుమూశారు. ఆయన ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువ నటుడి బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. మెడికల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సుశాంత్‌సింగ్ కేవలం 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడం పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్ రాజధాని పాట్నాకు చెందిన ఆయన తొలుత టీవీ సీరియళ్లలో నటించారు. అనంతరం హిందీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సుశాంత్‌కు తండ్రి, నలుగురు అక్కలు ఉన్నారు. తల్లి 2002లో మరణించారు. ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్(28) జూన్ 9న ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
జీవితం చావడానికి కాదని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. కాక్కా ముట్టై చిత్రంతో తమిళ సినిమాకు తానేమిటో నిరూపించుకున్న నటి ఐశ్వర్య రాజేష్, ఆ తర్వాత వరుసగా కథానాయికగా చిత్రాలు చేస్తున్న ఈమె ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తాజాగా గ్లామర్ పాత్రలకు సిద్ధమవుతున్నారు. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్నారు. అలా గ్లామర్తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తున్నారు.