మెదక్ ప్రజలు “పద్మ”వ్యూహంలో చిక్కిన అభిమన్యులు: రాజశేఖర్ రెడ్డి

మెదక్ ప్రజల పరిస్థితి పద్మాదేవేందర్ రెడ్డి నాయకత్వంలో “పద్మ”వ్యూహంలో చిక్కిన అభిమన్యుడిలా అయిందని తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గతంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు అయినపుడు హరీష్ రావు గారు అయన స్వార్థ ప్రయోజనముతో ఉమ్మడి జిల్లా పేరు చెప్పుకొని ఆ కాలేజీని తన ప్రాంతం అయిన సిద్దిపేట కు కు కేటాయించుకున్నారని మరి ఇప్పుడు కరోనా ఆసుపత్రి మాత్రం మెదక్ ఆస్పత్రిలో ఉద్దేశపూర్వకంగానే వేయించారని మండిపడ్డారు మెదక్ ప్రజల ప్రాణాలు హరీష్ రావు గారికి లెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు ఈ జరుగుతున్న తంతు చూస్తూనే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మౌనం వహించటంలో ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. మీరు మెదక్ నాయకురాలిగా ఎన్నికయింది మందికి మంగళహారతి పట్టడానికా అని ఆయన ధ్వజమెత్తారు.covid 19 ఆస్పత్రిని తక్షణమే మెదక్ నుండి ఉపసంహరించుకొని సిద్దిపేటకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు….