గజ్వేల్‌లో కూతపెట్టిన రైలుబండి
ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాకలలో రైలుబండి కూత పెట్టింది. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ అనుకున్నది సాధించారని స్థానిక ప్రజలు అంటున్నారు. గత కొన్ని రోజులుగా యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులు పూర్తి కావడంతో… ట్రయల్ రన్‌ని దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్వహించింది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే గజ్వేల్‌కి రైలు ప్రయాణం దూరమైంది. కానీ ఇప్పటికీ రైలు ప్రయాణం అందుబాటులోకి రాలేదు. పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేశాక మాత్రమూ రైలు నడిపించే యోచనలో ఉంది. కాబట్టి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్ల కల నెలవేరిందని..బంగారు తెలంగాణలో ఇది ఓ భాగమేమనని స్థానికి తెరాస నాయకులు అంటున్నారు.