ఫౌం హౌస్ కాదు దొర… కాస్త మా మమ్మల్ని కూడా చూడు : తెజస
కల్వకుంట్ల కుటుంబానికి ఫాంహౌస్ ల మీద ఉన్న శ్రద్ధ… కరోనాని నియంత్రించడంలో లేదని విమర్శించారు తెజస యువ నేత రాజశేఖర్‌రెడ్డి. కరోనాను నియంత్రించడంలో తెరాస సర్కార్ విఫలమైందన్నారు. మెదక్ జిల్లాలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో సరైన రక్షణ కల్పించకుండా వైద్య సిబ్బంది ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గచ్చిబౌలి హాస్పిటల్ లో ఎందుకు ట్రీట్ మెంట్ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పక్కన్న పెట్టి సీఎం కుమారుడు కేటీఆర్ తన ఫౌం హౌస్‌ను రక్షించుకోవడానికి కోర్టు స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.