కేటీఆర్ మౌనం ఎందుకు ? : రాజశేఖర్‌రెడ్డి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై వస్తున్న ఆరోపణలపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని తెజస మెదక్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. జనవాడలోని ఫాంహౌస్ విషయంలో మంత్రి మౌనం వెనుక ఉన్న నిజాలు ఎంటో ప్రజానికానికి తెలియాలి అంటే మంత్రి తప్పకుండా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి లేని తెలంగాణను ప్రజలకు అందిస్తామని సీఎం అంటుంటే…. ఆయన సొంత కుమారుడే అధికారం అడ్డం పెట్టుకుని గండిపేటకు నీళ్లు వచ్చే కాలువలను ఏ విధంగా పూడ్చేస్తారని అన్నారు. ఓ వైపు కాళేశ్వరం నుండి నీళ్లు అంటూ వందల కిలో మీటర్లు కాలువలు తవ్వుతున్నారు మీరు… హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న చెరువులకు నీరు రాకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు.