బోనాల ఉత్సవాల కోసం సమావేశం

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయమై ఈ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) లో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్, హోం శాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి శ్రీ సబితా ఇంద్రారెడ్డి,కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి, జీఎచ్ఎమ్సి పరిధిలోని ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, జీఎచ్ఎమ్సి కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్ లు పాల్గొంటారు. వీరే కాకుండా గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకులు, పాటబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో బోనాల ఉత్సవాల పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.