బెల్లంపల్లి దళిత అమ్మాయి పై దాడి పై స్పందించిన కమిషన్

సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్

బెల్లంపల్లి లో దళిత అమ్మాయి పై జరిగిన దాడి సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని మీద స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమోటాగా స్వీకరించారు. ఈ విషయం పై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాల నివేదికను తక్షణమే కమిషన్ కార్యాలయానికి పంపవలసిందిగా పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలతో, పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది.