మెద‌క్‌లో తొల‌క‌రి చినుకులు

ఎండకాలం నుంచి ప్ర‌జ‌ల‌కు ఇవాళ కాస్త విముక్తి క‌లిగింది. వాన‌కాలం తొల‌క‌రి చినుకులు ముందే మెద‌క్ జిల్లాను తాకాయి. దీంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేశారు. మిట్ట‌మ‌ధ్యాహ్నాం ఇద‌రుగాలుల‌తో కూడిన వ‌ర్షం వ‌చ్చింది. జిల్లాలోని చిన్న‌శంక‌రంపేట‌, చేగుంట‌, వెల్ధుర్తి, పాప‌న్న‌పేట‌, మెద‌క్‌, రామ‌యంపేట, తూప్రాన్ ప‌ట్టణంతో పాటు ప‌లు గ్రామాల్లో దాదాపు గంట పాటు వ‌ర్షం కురిసింది. దీంతో రైతులు తుకాలు పోసుకోవ‌డానికి వీల‌వుతుంద‌ని అంటున్నారు. మ‌రో రెండు మూడు పెద్ద వాన‌లు ప‌డితే త్వ‌ర‌లోనే వ‌ర్ష‌కాలం పంటల ప‌నులు మొద‌లుకానున్నాయి.