కొండ పోచమ్మ దేవాలయంలో వేకువజామున 4.30 గంటలకే చండీయాగం ప్రారంభం అవుతుంది.
గ్రామ సర్పంచ్ రజిత- రమేశ్, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి చండీహోమం నిర్వహిస్తారు.
సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఉదయం 7 గంటలకు చేరుకుని అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు.
ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. 9.40 గంటలకు మర్కుక్‌లోని రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు.
ఉదయం 9.50 నిమిషాలకు సీఎం మర్కుక్ పంప్ హౌస్ చేరుకుంటారు.
మర్కుక్ పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్దకు చేరుకునే త్రిదండి చినజీయర్ స్వామి వారి వద్దకు 10 గంటల సమయంలో సీఎం చేరుకుంటారు.
త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కలిసి మర్కుక్ పంప్ హౌస్ వద్ద సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొంటారు.
సుదర్శన హోమం, పూర్ణాహుతి ముగిశాక 11.30 గంటల సమయంలో పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత చినజీయర్ స్వామితో కలిసి కొండ పోచమ్మ సాగర్ కట్ట మీద డెలివరీ సిస్టమ్ దగ్గరకు చేరుకుంటారు.
11.35 గంటలకు డెలివరీ సిస్టమ్ దగ్గర గోదావరి జలాలను స్వాగతిస్తూ.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
మధ్యాహ్నం 12 గంటలకు కొండ పోచమ్మ డెలివరీ సిస్టమ్ నుంచి బయలుదేరి వరదరాజుపూర్ గ్రామంలోని వరద రాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తారు.
12.40 గంటలకు వరదరాజు పూర్ నుంచి బయలుదేరి మర్కుక్ పంప్ హౌస్ దగ్గరకు సీఎం చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు.